మూడో రోజు సీబీఐ విచారణకు కార్తీ చిదంబరం

మూడో రోజు సీబీఐ విచారణకు కార్తీ చిదంబరం

వీసా కుంభకోణం కేసులో వరుసగా మూడవ రోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం. కార్తీ చిదంబరాన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి హోంమంత్రిగా ఉన్న సమయంలో 263మంది చైనీయులు అక్రమ వీసాలు పొందడంలో సాయం చేశారని ఆయనమీద ఆరోపణలున్నాయి. ఈ కేసులో గత వారం సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ సందర్భంగా కార్తీ చిదంబరం మాట్లాడుతూ..టెస్ట్ మ్యాచ్ ఐదు రోజుల పాటు ఉంటుంది..నాది ఇంకా మూడవ రోజే అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఇప్పటికే స్పీకర్ కు లేఖ రాశానని..ఆయన ఆదేశాల కోసం చూస్తున్నట్లు తెలిపారు. 

కాగా ఈ కేసులో మే 17న కార్తీచిదంబరం సన్నిహితులు ఎస్.భాస్కరరామన్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. వేదాంత గ్రూప్ కు చెందిన టీఎస్పీఎల్ కంపెనీ నుండి చిదంబరం 50లక్షలు లంచం తీసుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. పవర్ ప్లాంట్ ప్రాజెక్టు కోసం 263 మంది చైనా కార్మికులకు వీసాలు మంజూరు చేయించిన వ్యవహారంలో సదరు కంపెనీ కార్తీ చిదంబరానికి డబ్బులు చెల్లించిందని ఆరోపించింది. సీబీఐ కేసు ఆధారంగానే ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.