
సన్న వడ్లను వేయమని సీఎం కీసీఆర్ చెబితేనే రైతులు వేశారని.. సన్నవడ్లకు మద్దతు ధర పెట్టి కొనుగోలు చెయ్యకుండా కీసీఆర్ రైతులను మోసం చేశాడన్నారు బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్…. కమీషన్ల రావు అయిండన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల చెన్నూర్ నియోజక వర్గానికి చుక్క నీరు అందలేదన్న ఆయన.. కాళెశ్వరం బ్యాక్ వాటర్ తో కొటపల్లి, వేమనపల్లి మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో జరిగిన పంట నష్టానికి పరిహారం వెంటనే చెల్లించి, అన్నదాతలను ఆదుకోవాలన్నారు. కీటీఆర్ రాష్ట్రంలో ఫెయిల్యూర్ మంత్రి అని.. ప్రజలు టీఆర్ఎస్ ను పక్కకు పెట్టి బీజేపీకే పట్టం కడుతున్నారన్నారు.