ధ‌నిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా చేశారు

ధ‌నిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా చేశారు

ధనిక రాష్ట్రమైనా తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా చేశారని తెలిపారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంక‌ట‌స్వామి. బుధ‌వారం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ ప‌ద‌వి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై మాట్లాడారు వివేక్ వెంక‌ట‌స్వామి. లీడర్లును వాడుకొని తెలంగాణను కుటుంబ రాజ్యంగా మార్చుకున్నాడని తెలిపారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేఖ విధానాలను బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తుందని..కరోన యుద్ధంలో మోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మోడీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్న వివేక్.. ప్రపంచంలో మోడీ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారన్నారు.

దేశంలోనే ముఖ్యమంత్రులు అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చిన వ్యక్తి ప్ర‌ధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనాను అరికట్టడిలో విజయవంతం అవుతుండడంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని తెలిపారు.పేద ప్రజలకు లక్ష 75 వేల కోట్ల ప్యాకేజీ మోడీ ప్రకటించారని..వలస కార్మకులకు, పేదలకు సహాయం చేస్తున్నారని తెలిపారు, బియ్యం, పప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని చెప్పారు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 2000 రు.లను ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. BJP రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ భాద్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు వివేక్ వెంక‌ట‌స్వామి.