సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశారు

V6 Velugu Posted on Apr 07, 2021

ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కు మద్దతుగా కేసీఆర్ పై ఒత్తిడికి తీసుకోచ్చేందుకు యూనివర్శిటీ విద్యార్థులు దీక్ష చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం..కానీ కేసీఆర్ అందరినీ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఉద్యమకారులను కూడా కేసీఆర్ మరిచిపోయాడని ఆరోపించారు. పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు.

ఉద్యోగాలు లేకుండా చేసి యూనివర్సిటీలను కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నాడని విమర్శించారు వివేక్ వెంకట స్వామి. ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడని..ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు.
సీఎం కేసీఆర్ కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు పైసలు లేకపోతే అందరం పోగు చేసి ఇచ్చామన్న వివేక్ వెంకట స్వామి.. ఆ డబ్బులతో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ భూములు కొంటున్నాడని ఆరోపించారు. అంతేకాదు ఇరిగేషన్ పేరుతో దందా చేస్తున్నాడన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించినట్టుగా ..ఒక్కొక్కరికి రావాల్సిన 80 వేల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

కరోనా సమయంలో ఐసోలేషన్ సెంటర్లు పెట్టమంటే సెక్రెటేరియట్ కడుతున్నారని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం 36 వేల కోట్ల ప్రాజెక్టు ను లక్ష కోట్లకు పెంచాడన్నారు. అంతేకాదు మెగా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే ధనికుడిని చేశారన్నారు. ఈ కమీషన్ల పై సీజీఐ విచారణ జరిపించాలని కోరారు. కమీషన్ల కోసమే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు వివేక్. తెలంగాణకు యువత ఎంతో అవసరమన్న వివేక్ వెంకట స్వామి..ఆత్మ బలిదానాలు వద్దన్నారు.

Tagged CM KCR, Vivek Venkataswamy, bjp leader, cheating

More News