టీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది:బీజేపీ

టీఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది:బీజేపీ

మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని బీజేపీ నేతలు అభినందించారు. టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు. మునుగోడు ఫలితాలపై  బండి సంజయ్ అధ్యక్షతన ఎన్నికల ఇంఛార్జీలతో బీజేపీ ముఖ్య నేతలు సమీక్ష నిర్వహించారు. ఉప పోరులో పార్టీ నేతల టీమ్ వర్క్ చాలా బాగుందని కొనియాడారు. ధర్మం, అధర్మం మధ్య జరిగిన పోరాటంలో సీఎం కేసీఆర్ అన్నీ అడ్డదారులు, అక్రమాలు, ప్రలోభాలకు గురిచేసి  గెలిచారని చెప్పారు. 

మునుగోడులో బీజేపీ గెలుపుకోసం అధిష్టానం అప్పగించిన బాధ్యతను ప్రతి ఒక్కరూ విజయవంతంగా పూర్తి చేశారని నేతలు అభినందించారు. ఉప ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. చివరి వరకు బీజేపీ పోరాడిన తీరు  అభినందనీయమని తెలిపారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా... అధికారాన్ని ఉపయోగించి అడ్డదారుల్లో గెలిచారని స్పష్టం చేశారు.