మున్సిపల్ పీఠంపై బీజేపీ జెండా ఎగరేస్తాం : అశోక్ గౌడ్

మున్సిపల్ పీఠంపై బీజేపీ జెండా ఎగరేస్తాం : అశోక్ గౌడ్
  • బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మీ, జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్

యాదగిరిగుట్ట, వెలుగు: త్వరలో జరగనున్న యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మీ, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ దీమా వ్యక్తం చేశారు.  బుధవారం యాదగిరిగుట్టలోని ఓ  ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు చీఫ్ గెస్ట్ లుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట ఆలయంలో జరుగుతున్న అవినీతిపై, మున్సిపాలిటీలో జరుగుతున్న కబ్జాలపై బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తోందన్నారు.

మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులతో పాటు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రచ్చ శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు చంద్రమౌళి, ఎన్నికల కన్వీనర్ లెంకలపల్లి శ్రీనివాస్, తాళ్ల భాస్కర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి భానుచందర్, టౌన్ మాజీ అధ్యక్షుడు భువనగిరి శ్యాంసుందర్, సీనియర్ నాయకులు రంగ సత్యం, బందారపు మల్లేష్ తదితరులు ఉన్నారు.