నిర్మల్ జిల్లాలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాలు

 నిర్మల్ జిల్లాలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాలు కొనసాగాయి. జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రధాని మోదీ ఫొటోలకు క్షీరాభిషేకాలు చేశారు. దేవాలయాల్లో పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో జాతీయ జెండాలను ప్రదర్శించి జైహింద్, జై భారత్ అంటూ నినాదాలు చేశారు. గాంధీ చౌక్, నాయుడు వాడలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ లోకసభ ఇన్​చార్జి అయ్యన్న గారి భూమయ్య, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ సాధం అరవింద్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, కమల్ నయన్ తదితరులు పాల్గొన్నారు.

భైంసాలో..

భైంసా, వెలుగు: ప్రధాని మోదీ తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ఆపరేషన్​ సిందూర్​ సక్సెస్​ అయిన నేపథ్యంలో భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్​లో సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. పట్టణ అధ్యక్షుడు రావుల రాము, మండల అధ్యక్షురాలు సుష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.