న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. రాహుల్.. టూర్ల లీడర్ అంటూ కామెంట్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా బుధవారం మాట్లాడుతూ.. ‘‘రాహుల్.. లీడర్ ఆఫ్ అపోజిషన్ కాదు.. లీడర్ ఆఫ్ పర్యటన్, లీడర్ ఆఫ్ పార్టీయింగ్” అని విమర్శించారు.
‘‘రాజకీయాలను రాహుల్ సీరియస్‌గా తీసుకోరు. అందరూ వర్కింగ్ మోడ్‌లో ఉంటే, ఆయన వెకేషన్ మోడ్‌లో ఉంటారు. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంటే జర్మనీకి వెళ్తున్నారు. ఆయన అక్కడికి ఎందుకు వెళ్తున్నారో నాకు తెలియదు. మళ్లీ విదేశీ గడ్డపై భారత్‌ను బద్నాం చేసేందుకే అయి ఉండొచ్చు” అని పూనావాలా అన్నారు. ‘‘ఎప్పుడూ పార్లమెంట్ జరిగే టైమ్‌లో రాహుల్ విదేశాల్లో ఉంటారు. ఆయన పార్ట్‌టైమ్, నాన్ సీరియస్ పొలిటికల్ లీడర్” అని విమర్శించారు. కాగా, ఈ నెల 15 నుంచి 19 వరకు రాహుల్ జర్మనీలోని బెర్లిన్‌లో పర్యటించనున్నారు.
ప్రియాంక కౌంటర్..
బీజేపీ నేతల కామెంట్లకు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రధాని మోదీ తన పని దినాల్లో దాదాపు సగం రోజులు దేశం బయటే ఉంటారు. అలాంటప్పుడు బీజేపీ నేతలు రాహుల్‌ను విమర్శిం చడం హాస్యాస్పదం” అని అన్నారు. ‘‘ఓట్ల చోరీపై రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలకు మోదీ దగ్గర జవాబు ల్లేవ్. రాహుల్ ప్రశ్నలకు జవాబుల్లేని ప్రతిసారీ బీజేపీ నేతలు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచాల ని చూస్తారు” అని గొగొయ్ మండిపడ్డారు.

