
హైదరాబాద్ కలెక్టరేట్ ముందు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సహా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ హామీలిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాడని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వంటి పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సేవ చేయడం మానేసి.. అందినకాడికి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని లక్ష్మణ్ ఘాటుగా విమర్శించారు.
తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలంతా బుద్ది చెప్పాలని సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని మండిపడ్డారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ అనేలా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రవర్తన ఉంది అని లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ మెడలు వంచి.. హక్కుల్ని సాధించుకుంటామని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 07 లోపు కేసీఆర్ ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలి లేదంటే.. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.