వివేకానందుడి సేవలు వెలకట్టలేనివి : ఉట్కూరి అశోక్ గౌడ్

వివేకానందుడి సేవలు వెలకట్టలేనివి : ఉట్కూరి అశోక్ గౌడ్
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్

యాదగిరిగుట్ట, వెలుగు: ప్రపంచానికి స్వామి వివేకానంద చేసిన సేవలు వెలకట్టలేనివని యాదాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో..  శుక్రవారం బీజేపీ యువ మోర్చా జిల్లా కోశాధికారి ఎరుకల చైతన్య సొంత ఖర్చులతో 200 మంది విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప మానవతావాది స్వామి వివేకానంద అని పేర్కొన్నారు.