అన్ని మండలాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తాం : ఎమ్మెల్యే బాలునాయక్ 

అన్ని మండలాల్లో మినీ స్టేడియాలు నిర్మిస్తాం : ఎమ్మెల్యే బాలునాయక్ 
  • దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ 

దేవరకొండ, వెలుగు: దేవరకొండ నియోజకవర్గంలో స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు, అన్ని మండల కేంద్రాల్లో మినీ స్టేడియాలు నిర్మించేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు.  శుక్రవారం దేవరకొండ పట్టణంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణలో తన కుమారుడు అభిలాష్ నాయక్ ఏర్పాటుచేసిన దేవరకొండ డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను కుటుంబ సభ్యులు,  స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ఇటీవల నూతనంగా దేవరకొండ ఆర్టీసీ డిపో మేనేజర్ గా బాధ్యతలు స్వీకరించిన విజయ కుమారి  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలు నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

ఆయా ప్రోగ్రాంలలో దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ జానీ యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య గౌడ్, మాజీ పీఎసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు  వేమన్ రెడ్డి, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.