
- అడిషనల్ కలెక్టర్ నగేశ్‌కు విన్నవించిన బీజేపీ నాయకులు
మెదక్‌టౌన్, వెలుగు: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ మెదక్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణ, పార్టీ జిల్లా ప్రెసిడెంట్ రాధా మల్లేశ్ గౌడ్ మంగళవారం అడిషనల్ కలెక్టర్ నగేశ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా ధాన్యాన్ని త్వరగా తరలించాలన్నారు. రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు రావాల్సిన బోనస్ డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌చేశారు.
బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని అదే తరహాలో కాంగ్రెస్ మోసం చేస్తోందని ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు బీజేపీ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, శంకర్ గౌడ్, బాలరాజు, సత్యనారాయణ, కాశీనాథ్, విజయ్ కుమార్, సిద్ధిరాములు, లోకేశ్, ప్రభాకర్, రాములు, మల్లారెడ్డి, నాగేందర్ చారి, మల్లిక, ప్రసాద్, వీణ, సంతోష్, అవినాశ్ రెడ్డి, వెంకట్ గౌడ్, దాసు, ఆంజనేయులు, శ్యామ్, కార్తీక్, లావణ్య, సంగీత, రాజి రెడ్డి, రాజు, ప్రేమ్, మల్లేశ్, మధు, శ్యామ్ పాల్గొన్నారు.