ఆటోకు తాళ్లను  కట్టి లాగిన బీజేపీ లీడర్లు 

ఆటోకు తాళ్లను  కట్టి లాగిన బీజేపీ లీడర్లు 

మెదక్​టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్​పై వ్యాట్​ను తగ్గించాలని డిమాండ్​ చేస్తూ ఆదివారం మెదక్​ టౌన్​లో బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. రాందాస్​చౌరస్తాలో ఆటోకు తాళ్లను కట్టి  లాగి నిరసన తెలిపారు. హాజరైన ఎస్టీ మోర్చ రాష్ట్ర సెక్రెటరీ అమర్​సింగ్​ పవార్, బీజేపీ డిస్ట్రిక్ట్ ​ప్రెసిడెంట్​శ్రీనివాస్, డిస్ట్రిక్ట్​ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్​ ప్రియానాయక్​మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలోని 21 రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్​పై వ్యాట్​ను తగ్గించిందన్నారు. అయినప్పటికీ తెలంగాణ సీఎం కేసీఆర్​వ్యాట్​ను తగ్గించక పోవడం వల్ల  ప్రజలపై భారం పడుతోందన్నారు. ప్రజాసంక్షేమం ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం నిలువు దోపిడీ  చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా జనరల్​సెక్రెటరీ విజయ్ కుమార్, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ  సభ్యుడు రెడ్యానాయక్, బాల్​కిషన్​ నాయక్​, శంకర్ నాయక్, యువ మోర్చా డిస్ట్రిక్ట్ ​ప్రెసిడెంట్​ఉదయ్ కిరణ్,  పట్టణ  అధ్యక్షుడు ప్రసాద్,  లీడర్లు శివ, వేణు, రవి, వరప్రసాద్ పాల్గొన్నారు.