
కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గూడ బస్తి చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన కరెంటు, బస్సు, విద్యార్థుల బస్ పాస్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని విమర్శించారు. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించాలని..లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.