- ఆర్డీవోను కోరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్, వెలుగు: నేషనల్ హైవే 63లో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించేలా చొరవ తీసుకోవాలని జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌ను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు. హైవే విస్తరణలో భూములు కోల్పోతున్న రైతుల పేర్లు రాకుండా.. ఓనర్ నాట్ ఐడెంటిఫైడ్ రావడంతో తమకు అన్యాయం జరిగిందని జగిత్యాల రూరల్ కల్లెడ గ్రామ రైతులు బుధవారం ఎమ్మెల్యేను క్యాంప్ ఆఫీసులో కలిశారు.
స్పందించిన ఆయన ఆర్డీవోను కలిసి రీ సర్వే నిర్వహించి భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ పరశురామ్ గౌడ్, మహేశ్వర్ రావు, హరికిషన్ రావు, రైతులు పాల్గొన్నారు.
