
- గవర్నర్కు బీజేపీ నేతల వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీయులను తక్షణమే భారత్ నుంచి పంపేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ మేరకు లక్ష్మణ్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిందని, తెలంగాణలోనూ అక్రమంగా ఉంటున్న పాక్ జాతీయులను గుర్తించి పంపేయాలని కోరారు.
బీజేపీ ప్రతినిధి బృందంలో మాజీ ఎమ్మెల్యేలు విజయరామారావు, చింతల రాంచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్ రావు, యెండల లక్ష్మీనారాయణ, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లు, బంగారు శృతి తదితరులు ఉన్నారు.