ఇయ్యాల్టి నుంచి బీజేపీ లీడర్ల జిల్లా పర్యటనలు

ఇయ్యాల్టి నుంచి  బీజేపీ లీడర్ల జిల్లా పర్యటనలు

హైదరాబాద్, వెలుగు: చెడగొట్టు వర్షాలకు నష్టపోయిన పంటలను బీజేపీ నేతల బృందం పరిశీలించనుంది. సోమవారం నుంచి 3 రోజుల పాటు 9 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించే నేతలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  నియమించగా, ఆ  వివరాలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్  రెడ్డి ఆదివారం మీడియాకు విడుదల చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్  చేస్తూ తమ నేతలు పర్యటన చేస్తారని ప్రేమేందర్  రెడ్డి తెలిపారు. వర్షాలకు మార్కెట్  యార్డుల్లో వడ్లకు మొలకలు వచ్చాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు.


జిల్లాల్లో పర్యటించే నేతల వివరాలు


1. మెదక్ – మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు 
2. నిజామాబాద్ – ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ బూర నర్సయ్య 
3. వరంగల్ – మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి విజయ రామారావు
4. ఆదిలాబాద్ – ఎంపీ సోయం బాపూ రావు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి
5. రంగారెడ్డి – మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి 
6. మహబూబ్ నగర్ – మాజీ మంత్రి డీకే అరుణ, పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్
7. నల్గొండ – మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి 
8. కరీంనగర్ – మాజీ ఎంపీ చాడ సురేశ్​ రెడ్డి, పార్టీ  ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్
9. ఖమ్మం – కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్