
యోగ ద్వారా భారత దేశం ప్రపంచానికి పాఠాలు నేర్పిందన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన బీజేపీ లీడర్ వివేక్ వెంకటస్వామితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండ్ సంజయ్..భారతీయ సనాతన ధర్మం యావత్తు ప్రపంచానికి ఆదర్శమన్నారు. ప్రధాని మోడీ స్ఫూర్తిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని చెప్పారు. యోగ సాధన ద్వారా దేన్నైనా సాధించవచ్చని తెలిపారు బండి సంజయ్.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి