మొదటి రోజు రెండు కోట్ల 20 లక్షలు గ్రాస్‌‌‌‌.. చిన్న చిత్రాల్లో ఈషా రికార్డ్

మొదటి రోజు రెండు కోట్ల 20 లక్షలు గ్రాస్‌‌‌‌.. చిన్న చిత్రాల్లో ఈషా రికార్డ్

త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ లీడ్ రోల్స్‌‌‌‌లో శ్రీనివాస్ మన్నె  తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’.  కేఎల్‌‌‌‌ దామోదర ప్రసాద్‌‌‌‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్‌‌‌‌, వంశీ నందిపాటి ఈ  చిత్రాన్ని  విడుదల చేశారు.  చిన్న చిత్రంగా విడుదలైన ఈ  చిత్రం పెద్ద సక్సెస్‌‌‌‌ను సాధించిందని మేకర్స్ అన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌లో బన్నీ వాస్ మాట్లాడుతూ ‘ఒక సినిమా హిట్‌‌‌‌ అనడానికి వసూళ్లే  ప్రామాణికం. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రెండు కోట్ల 20 లక్షలు గ్రాస్‌‌‌‌ను వసూలు చేసింది.  చిన్న చిత్రాల్లో ఇది రికార్డు.  చాలా చిన్న బడ్జెట్‌‌‌‌తో తీసిన చిత్రమిది. రెండో రోజు కూడా కలెక్షన్లు తగ్గకుండా  బాక్సాఫీస్‌‌‌‌ విన్నర్‌‌‌‌గా నిలిచింది. ఇలాంటి  సినిమాను ఎంకరేజ్ చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. కంటెంట్‌‌‌‌ ఈజ్‌‌‌‌ కింగ్‌‌‌‌ అని ఈ సినిమా మరోసారి ప్రూవ్‌‌‌‌ చేసిందని టీమ్ చెప్పింది.