ఖమ్మం నగరంలో బిహార్ విజయంతో బీజేపీ సంబురాలు

 ఖమ్మం నగరంలో బిహార్ విజయంతో బీజేపీ సంబురాలు

ఖమ్మం టౌన్/పాల్వంచ, వెలుగు :  బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ  ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జడ్పీ సెంటర్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.  

పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు మాట్లాడుతూ దేశ ప్రజలు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఓటు దోపిడీ అంటూ చేసిన అబద్ధపు ప్రచారాలు, భయపెట్టే వ్యాఖ్యలు ఎక్కడా నమ్మలేదన్నారు. 

అభివృద్ధిని చూసిన ప్రజలు బీజేపీకి  మద్దతు ఇస్తున్నారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ బిహార్ ప్రజలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై పూర్తి నమ్మకం ఉంచారని తెలిపారు. 

కాగా, పాల్వంచలో పార్టీ జిల్లా అధ్ క్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంబురాలు నిర్వహించారు.  ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షుడు బండారు నరేశ్, రవి రాథోడ్, కార్యదర్శులు రజినిరెడ్డి, మంద సరస్వతి, డోకుపర్తి రవీందర్, సురేశ్, బోయినపల్లి రవి గౌడ్, బోయినపల్లి చంద్రశేఖర్, మణి, కొణతం లక్ష్మీనారాయణ, పమ్మి అనిత, గడిల నరేశ్, గుత్తా వంశీ, మాధవ్ పాల్గొన్నారు.