డీ వన్ భూముల అక్రమార్కులను వదిలిపెట్టం : మహేశ్వర్ రెడ్డి

డీ వన్ భూముల అక్రమార్కులను వదిలిపెట్టం : మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు : నిర్మల్​లో గత పాలకుల పాపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని, ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆయన తన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో చెప్పినట్లుగా ఆధారాలతో సహా కలెక్టర్​కు ఫిర్యాదు చేశామని, వాస్తవాలను పరిశీలించి అధికారులే విస్తుపోయారన్నారు. 256 సర్వే నంబర్​లోని ప్రభుత్వ భూమిలో డీమార్ట్ నిర్మాణానికి అనుమతిచ్చారని, ఈ అనుమతులపై కలెక్టర్ విచారణ కొనసాగుతోందని, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ల్యాండ్ గ్రాబింగ్ కింద చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు.

నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల్లో డీ1 పట్టాల పేరుతో దోపిడీ జరిగిందని, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రజాప్రతినిధి హయాంలోనే 350 కొత్త పట్టాలు సృష్టించారని ఆరోపిం చారు. నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 3వేల ఎకరాల భూమిని బడా నేతలు కాజేశారని‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు ఇస్తామని వెల్లడించారు.

దేవాలయాల భూములను కబ్జా చేస్తే ఊరుకో మని, ఆలయాల భూముల పరిరక్షణ కోసం రాష్ట్ర వాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్​చార్జి రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, నాయకులు డి.ముత్యం రెడ్డి, గంగన్న, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాగర్ పాల్గొన్నారు.