అవినీతిపరుల ఆటకట్టించడం బీజేపీతోనే సాధ్యం

అవినీతిపరుల ఆటకట్టించడం బీజేపీతోనే సాధ్యం

కేసీఆర్ పాలనలో చెరువులు, కుంటలు సహా కరీంనగర్ లో గుట్టలు మాయమైపోయాయని బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డవారి నుంచి అన్నీ కక్కిస్తామన్నారు. భూ బకాసురులు, అవినీతి తిమింగళాల ఆటకట్టించడం బీజేపీతోనే సాధ్యమన్నారు. ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను చూసి కేసీఆర్ గజగజ వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. 

కేసీఆర్ భారత్ మాతాకీ జై అనేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని మురళీధర్ రావు అన్నారు. విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందని.. ఈ కార్యక్రమానికి అమిత్ షా వస్తున్నట్లు తెలిపారు. రజాకార్ల గురించి 8 ఏళ్లుగా ఎవరైతే మర్చిపోయారో.. వాళ్ళ లెక్క తీసేందుకే అమిత్ షా వస్తున్నారని చెప్పారు. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే బీజేపీ వ్యతిరేకమని..గిరిజనులకు రిజర్వేషన్ల విషయంలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు