బెంగాల్ నుంచి లోక్ సభ బరిలో క్రికెటర్ షమీ.?

బెంగాల్ నుంచి లోక్ సభ బరిలో క్రికెటర్ షమీ.?

టీమిండియా స్టార్ బౌలర్ షమీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది.  వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌ నుంచి  మహ్మద్‌ షమీని పోటీకి దింపాలని బీజేపీ యోచిస్తోంది.   షమీ ఇప్పటికే  రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు  ఆడుతున్నాడు. అతను  ఇప్పటికీ  బెంగాల్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. ప్రపంచ కప్ ఓడిపోయిన తర్వాత షమీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి మోదీ ఓదార్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దించాలని బీజేపీ  భావిస్తోందట. తద్వారా మైనార్టీల ఓట్లను ఆకర్షించాలనేది కాషాయ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ప్రతిపాదన పంపగా.. దీనిపై షమీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు సమాచారం.  ప్రస్తుతం బసిర్‌హత్‌ నియోజకవర్గానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున నుస్రత్‌ జహాన్‌ ఎంపీగా ఉన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.    వ‌న్డే వ‌ర‌ల్డ్ కప్ త‌ర్వాత ష‌మీ ఇప్పటి వ‌ర‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌లేదు. ఆ టోర్నీలో 24 వికెట్లు తీశాడ‌త‌ను. 

ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు గౌతమ్‌ గంభీర్, మనోజ్‌ తివారి తదితరులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గౌతమ్‌ గంభీర్‌ బీజేపీ ఎంపీగా ఉండగా, మనోజ్‌ తివారి పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.