ఉద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నవ్

ఉద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నవ్

జీవో 317 ఉద్యోగులు, టీచర్లకు కునుకు లేకుండా చేస్తుందన్నారు ఈటల రాజేందర్. సూర్యపేటలో జరుగుతున్న తెలంగాణ ప్రాంత శిక్షణ తరుగతుల కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవో 124 స్థానికత కేంద్ర బిందువుగా బదిలీ చేయాలని 2018లో ఉత్తర్వులు వచ్చినా అది పట్టించుకోడం లేదని విమర్శించారు. జీవో 317లో స్థానికత ఊసే లేదని తెలిపారు.మూడేళ్లు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ కి పరిమితమయ్యి, ఉద్యోగ, టీచర్ల సంఘాలతో చర్చించకుండా ఇప్పుడు పరుగులు పెడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించారు. ఇప్పుడిచ్చిన సీనియారిటీలో పారదర్శకత లేదన్నారు. సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధనలో భాగమైన వారి జీవితాల్లో మట్టి కొట్టొద్దన్నారు ఈటల.