హుజురాబాద్ ఫలితాన్ని డైవర్ట్ చేయడానికే కేసీఆర్ డ్రామాలు

హుజురాబాద్ ఫలితాన్ని డైవర్ట్ చేయడానికే కేసీఆర్ డ్రామాలు

తెలంగాణలో ధాన్యం తడిచి రైతుల కళ్లల్లో కన్నీరే మిగిలిందని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రైతులు చనిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకునీరేత్తనట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 

‘కేసీఆర్ ఈ రోజు ధర్నా చేపట్టి.. తన వైఫల్యాలను కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ భాషను చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోంది. రైతులు కష్టపడి పండిస్తే.. క్వింటా ధాన్యంపై 8 నుంచి 12 కిలోలు కట్ చేస్తున్నారు. నాకే అన్నీ తెలుసు అని కేసీఆర్ భావిస్తున్నారు. రైతుల మరణాలకు పూర్తి బాధ్యత కేసీఆర్ తీసుకోవాలి. కేసీఆర్ తన కీర్తి కోసం తప్ప ప్రజల కోసం పని చేయడు. ధర్నా చౌక్‎లో ఎవరి మీద మీ ధర్నా? నీ పతనం ఆరంభమైంది. హుజురాబాద్ ఫలితాన్ని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ ఈ డ్రామాలు ఆడుతున్నరు’ అని ఈటల రాజేందర్ అన్నారు.