కేసీఆర్​ తీరుతో పల్లె ప్రగతి వెలవెల

కేసీఆర్​ తీరుతో పల్లె ప్రగతి వెలవెల

కేంద్రం నిధులను కేసీఆర్​ దారిమళ్లిస్తున్నరు: ఈటల

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​ తీరు వల్ల పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం వెలవెలబోతున్నదని, ఇందులో పాల్గొనేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ అన్నారు. ‘‘కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని, అవమాన భారంతో కుంగిపోతున్నామని సర్పంచ్​లు అంటున్నరు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో పాల్గొనబోమని చెప్తున్నరు” అని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే.. వాటిని కేసీఆర్ దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.  

ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం10 శాతమే ఇస్తున్నదన్నారు. వీఆర్ వో లకు రెండేండ్లుగా కేసీఆర్​ నరకం చూపెడుతున్నారని, విలేజ్ సెక్రటరీలను ఉదయం 6 గంటలకే డ్యూటీలకు హాజరు కావాలని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. విలేజ్​ సెక్రటరీలను రెండేండ్లలో పర్మినెంట్ చేస్తామని చెప్పి ఇంకా చేయలేదని తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ లోని రేణుక ఎల్లమ్మదేవి ఆలయ వార్షికోత్సవంలో ఈటల పాల్గొన్నారు. అమ్మ వారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

మరిన్ని వార్తల కోసం...

ఒక్క నెలలో ఆర్టీఏకి 405 కోట్ల ఆమ్దానీ

నేటికీ పూర్తికాని రామప్ప – ధర్మసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నెల్ ​పనులు