కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు

కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు

పాలన విషయంలో సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. సర్పంచులు, ఎంపీటీసీలను గ్రామాభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని మండిపడ్డారు. ఘట్కేసర్లో ఆయన సమక్షంలో రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి 200 మంది అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. 

రాష్ట్రంలో అవినీతి, కుటుంబపాలనను అంతం చేసేందుకు చాలా మంది బీజేపీలో చేరుతున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని మండిపడ్డారు. రుణమాఫీ చేయకుండా రైతులను, పీఆర్సీ, డీఏలు ఇవ్వకుండా ఉద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఈటల విమర్శించారు.