రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టండి : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టండి : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, చర్చించాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రం ‘నాన్ -పర్ఫార్మింగ్’అకౌంట్ (ఎన్పీఏ)గా మారిపోయిందని ఆరోపించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.

ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కార్ విఫలమైందని ఆరోపించారు. రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాల అమల్లో ప్రభుత్వం వెనుకబడిందని, దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందని ఆరోపించారు.