సిద్దిపేట పోలీసులు అధికార పార్టీకి తొత్తులు: రఘునందన్రావు

సిద్దిపేట పోలీసులు అధికార పార్టీకి తొత్తులు: రఘునందన్రావు

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా పోలీసులు అధికార పార్టీకి తోత్తులుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తాను అధి కార పార్టీ నేతలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు బీఆర్ఎస్ నేతలతో చేతులు కలిపి బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టెందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. 

ఈ మేరకు శుక్రవారం బీఆర్కే భవన్​లో సీఈవో వికాస్​ రాజ్​ను బీజేపీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, రఘునందన్​ రావు  కలిసి కంప్లయింట్​ చేశారు. అనంతరం రఘునందన్​ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే  పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు.

 పైగా బీఆర్ఎస్ నేతలతో కలిసిపోయి  తమ పార్టీ నేత లపైనే ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరో పించారు. సిద్దిపేట సీపీ శ్వేత, ఏసీపీపై ఫిర్యాదు చేశామన్నారు. సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో కల్యాణ లక్ష్మీ చెక్ లు పంచుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. 

మర్రి శశిధర్​ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక లక్ష 65వేల డూబ్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ కు ఓట్లు వేయరనే ఉద్దేశంతో గేటెడ్ కమ్యూనిటీలో నివసించే వారికి ఓటు హక్కు కల్పించడం లేదని విమర్శిచారు. డిలీట్ అండ్ యాడ్ ఓటర్ లిస్ట్ కావాలని సీఈవోను కోరినట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.