ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..?

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా..?

రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే ఇదేనా అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తల అరెస్ట్ వివరాలు అడిగితే చెప్పకపోవడం దారుణమన్నారు. సీఎం కనుసన్నల్లో పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ ను మర్చిపోయి కల్వకుంట్ల కుటుంబం చెప్పిన సెక్షన్లు పెడుతున్నారని ఆరోపించారు. ఒకే కేసులో మూడు సార్లు సెక్షన్లు మార్చడం ఏంటని నిలదీశారు. అరెస్ట్ చేసిన వ్యక్తుల హక్కుల్ని కాలరాస్తున్నారని.. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ..నాన్ బెయిల్బుల్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే కేసులు పెట్టడం సిగ్గుచేటని రఘునందన్ రావు అన్నారు. ధర్మదీక్షకు సిద్ధమైన బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రతిపక్షానికి నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించిన ఆయన.. బీజేపీ నేతలపై పెట్టిన కేసులను వెంటనే విత్ డ్రా చేయాలని డిమాండ్ చేశారు. తమ కార్యకర్తలపై టీఆర్ఎస్ లీడర్స్ దాడి చేసిన ఘటన పై ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.