వకీల్ సాబ్ లా అండగా ఉంటా: ఎమ్మెల్యే రఘునందన్ రావు

వకీల్ సాబ్ లా అండగా ఉంటా: ఎమ్మెల్యే రఘునందన్ రావు

బొడుప్పల్ ప్రజలను వక్ఫ్ పేరిట ప్రభుత్వం వేధించడం అన్యాయమన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మార్చి 26వ తేదీ ఆదివారం బోడుప్పల్ లో ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డు బాధితుల జేఏసీ సర్వసభ్య సమావేశానికి రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడు వందల ఎకరాలలో ఏర్పడిన వెంచర్ ల నుండి కొనుక్కొని ముప్పై సంవత్సరాలపైగా ఏడు వేల కుటుంబాలు నివాసముంటున్నారని తెలిపారు.

బోడుప్పల్ లో మూడు వందల ఎకరాలు కాదు, మూడు వేల ఎకరాలు వక్ఫ్ భూమి ఉందని అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో మాట్లాడటంతో బోడుప్పల్ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు రఘునందన్ రావు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బొడుప్పల్ ప్రజలకు వకీల్ సాబ్ లా అండగా ఉండి వకాలత్ చేస్తానని.. బోడుప్పల్ ప్రజలకు ధైర్యం చెప్పారు రఘునందన్ రావు. ఎల్బీనగర్ చౌరస్తాకి శ్రీకాంత్ చారీ పేరు పెట్టడం పన్నెండు సంవత్సరాలకు మీ మనసు ఎలా వచ్చిందో కానీ.. బోడుప్పల్ ప్రజానీకానికి వక్ఫ్ సమస్య త్వరగా పరిష్కరించాలని కేటీఆర్ ను డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.