కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండు : రఘునందన్ రావు

కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చిండు : రఘునందన్ రావు

రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణి చేస్తానన్న సీఎం కేసీఆర్ కోటి మంది తాగుబోతుల వీణగా మార్చారని ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద రైతుల సమస్యలపై బీజేపీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతుల కష్టాలు దృష్టిలో పెట్టుకొని ధర్నా చేస్తున్నామని రఘునందన్ చెప్పారు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో 8వేల మంది రైతులు చనిపోయారని చెప్పారు. 

సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో 24 గంటల కరెంట్ వస్తుందా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. జిల్లాలో జరిగే అక్రమాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలన్నారు. కిరాణ షాపుల్లో మద్యం దొరికే విధంగా రాష్ట్రాన్ని మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. దళితలకు గతంలో ఇచ్చిన భూములను బలవంతగా లాక్కొని కలెక్టరేట్లు, ఇతర భవనాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉందని రఘునందన్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ధరణిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి నియోజకవర్గ అభివృద్ధి గురించి తెలియదు కానీ పబ్ల గురించి మాత్రం తెలుసన్నారు. ప్రభాకర్ రెడ్డి మరోసారి గెలవడని చెప్పారు. బీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడమని చెప్పారు.