పీడీ యాక్ట్ అడ్వైజరీ కోర్టు ముందు హాజరైన రాజాసింగ్

పీడీ యాక్ట్ అడ్వైజరీ కోర్టు ముందు హాజరైన రాజాసింగ్

పీడీ యాక్ట్ అడ్వైజరీ కోర్టు ముందు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. పోలీసుల తరుపున డీసీపీ జోయల్ డేవిస్ హాజరయ్యారు. అడ్వైజరీ బోర్డుకి రాజసింగ్ భార్య వినతిపత్రం అందజేశారు. పీడీ యాక్ట్ ని రివోక్ చేయాలని రాజాసింగ్ భార్య అప్పీల్ చేసినట్లు అడ్వకేట్ కరుణసాగర్ తెలిపారు. 

రాజకీయ దురుద్దేశంతో పీడీ యాక్ట్ పెట్టారని రాజసింగ్ బోర్డకు తెలిపినట్లు కరుణసాగర్ చెప్పారు. అడ్వైజరీ బోర్డ్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. అడ్వైజరీ బోర్డ్ రిపోర్ట్ వ్యతిరేకంగా వస్తే.. మళ్ళీ హైకోర్టుని ఆశ్రయిస్తామని తెలిపారు. ఇప్పటికే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామన్న ఆయన..దీనిపై ప్రభుత్వం ఇంకా కౌంటర్ దాఖలు చేయాల్సివుందన్నారు.