
హైదరాబాద్: సిటీలో అక్రమ నిర్మాణాలపై చర్యల కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ పనితీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ కంప్లయింట్ సెల్‌కు అక్రమ నిర్మాణాలపై ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయిని.. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కానీ కన్‌స్ట్రక్షన్ జరిగిన చోటుకు వెళ్లి ఇన్ని ఫ్లోర్‌లు మాత్రమే వేయాలని, ఎక్కువ ఫ్లోర్‌లు ఎందుకు వేశారంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు ఫుల్‌గా కలెక్షన్‌లు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోకవర్గాల్లోనూ చాలా మంది బిల్డర్‌లు అక్రమ నిర్మాణాలు కట్టి, టౌన్ ప్లానింగ్ అధికారులకు లంచాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ ఉన్నది వసూళ్లకేనా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఏమీ చేయలేకపోతున్నారని విమర్శించారు.