అధికార పార్టీ నేతలకు సీఎం ప్రత్యేకంగా లైసెన్సులు ఇచ్చారా?

అధికార పార్టీ నేతలకు సీఎం ప్రత్యేకంగా లైసెన్సులు ఇచ్చారా?

కొత్తగూడెం రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వనమా రాఘవను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు..? అతని వెనకున్న అదృశ్య శక్తి ఎవరన్నారు బీజేపీ ఎల్పీ నేత రాజాసింగ్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వారి కుటుంబ సభ్యులు చేసే అరాచకాలకు సీఎం వత్తాసు పలుకుతున్నాడని తెలిపారు. వనమా రాఘవ ఆచూకీ దొరకలేదని పోలీసులు చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే నిమిషాల్లో అరెస్ట్ చేసే పోలీసులు మానవ మృగాన్ని రోజుల తరబడి పట్టుకోలేకపోవడం దేనికి సంకేతమన్నారు.

అధికార పార్టీ నేతలు హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులకు పాల్పడొచ్చంటూ సీఎం ప్రత్యేకంగా లైసెన్సులు ఇచ్చారా..? అంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల అరాచకాలు సీఎంకు, ఆయన కొడుకు కళ్లకు కనిపించకుండా కళ్లకు గంతలు కట్టుకున్నారా..? అన్నారు. తక్షణమే వనమా రాఘవను అరెస్ట్ చేయాలన్న ఆయన ఎమ్మెల్యే పదవికి వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలన్నారు. నిందితుడికి త్వరగా శిక్షపడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని రాజాసింగ్.