బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి గాయం : ప్రత్యేక విమానంలో హైదరాబాద్

బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి గాయం : ప్రత్యేక విమానంలో హైదరాబాద్

సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ.. ప్రస్తుతం ఏపీలోని విజయవాడ బీజేపీ ఎమ్మెల్యే అయిన సుజనాచౌదరి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన ప్రత్యేక విమానంలో.. హైదరాబాద్ బేగంపేటకు వచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఆయన కిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

సుజనా చౌదరి ప్రముఖ పారిశ్రామికవేత్త కూడానూ.. ఆయన ఇంగ్లాండ్ దేశంలో పర్యటనకు వెళ్లారు. లండన్ లోని ఓ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేస్తున్న సమయంలో.. ప్రమాద వశాత్తు కింద పడినట్లు చెబుతున్నారు ఆయన వర్గీయులు. షాపింగ్ మాల్ లో కింద పడిన సమయంలో.. కుడి భుజం ఎముక విరిగినట్లు తెలుస్తోంది. లండన్ లోనే ప్రాథమిక చికిత్స తర్వాత.. ప్రత్యేక విమానంలో నేరుగా హైదరాబాద్ వచ్చారు.

►ALSO READ | ఐపీఎస్ ఆంజనేయులు అరెస్ట్పై.. కూటమి ప్రభుత్వాన్ని తప్పుబట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి

సుజనాచౌదర కుడి భుజంకు కిమ్స్ ఆస్పత్రిలో సర్జరీ చేస్తున్నట్లు ఆయన పీఆర్ టీం చెబుతోంది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని.. అంతకు మించి ఇంకేమీ సమస్య లేదని వెల్లడిస్తున్నారు. ఆపరేషన్ తర్వాత ఇంటికి వెళతారని.. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని.. ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.