
రాజమండ్రి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం విజయవాడ జైలుకు వెళ్లి పీఎస్ఆర్ను కలిసి వచ్చానని, చంద్రబాబు ప్రభుత్వం పీఎస్ఆర్పై కక్ష సాధిస్తోందని ఆయన ఆరోపించారు.
ముంబై నటి తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు ఇచ్చిందని, ముంబైలో ఆ కేసు పరిష్కారం కాకుండా ఏపీలో విచారణ ఎలా ప్రారంభిస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. పీఎస్ఆర్ అరెస్ట్ పోలీస్ శాఖపై చాలా ప్రభావం చూపుతుందని, తాను మరి కొంతకాలం జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నానని పీఎస్ఆర్ తనతో చెప్పారని ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాకు తెలిపారు.
అసలు ఈ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఎవరంటే..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులును ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజుపై థర్డ్ డిగ్రీ కేసులో కూడా పీఎస్ఆర్ ఆంజనేయులు నిందితుడు. పీఎస్ఆర్ మాజీ సీఎం జగన్కు విధేయుడనే ప్రచారం ఉంది. పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు.
►ALSO READ | శ్రీశైలంలో హుండీని దోచుకున్న ఇద్దరు పిల్లలు : ఆలయం గర్భగుడిలోనే ఈ ఘటన
జత్వానీ కేసులో ఆంజనేయులును సీఐడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. తనపై తప్పుడు ఫిర్యాదు ఆధారంగా అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని ముంబై నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే తనను అక్రమంగా నిర్బంధించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.