శ్రీశైలంలో హుండీని దోచుకున్న ఇద్దరు పిల్లలు : ఆలయం గర్భగుడిలోనే ఈ ఘటన

శ్రీశైలంలో హుండీని దోచుకున్న ఇద్దరు పిల్లలు : ఆలయం గర్భగుడిలోనే ఈ ఘటన

నంద్యాల జిల్లా  శ్రీశైలం మల్లన్న ఆలయంలో హుండీలో చోరీ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మే 1వతేదీన దర్శనం కోసం ఆలయానికి వచ్చిన స్థానికంగా నివసించే ఇద్దరు  బాలురు  దొంగతనానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే..

  మల్లికార్జునస్వామి ఆలయం ప్రాంగణంలోని   క్లాత్ హుండీని బ్లేడ్ తో కోసి డబ్బు తీస్తుండగా సీసీ కెమారాలో ఈ ఘటనను గమనించిన అధికారులు ఆ బాలురను పట్టుకున్నారు.  నిందితులు నుంచి  10 వేల150రూపాయిలను ఈవో స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు .. ఈవో ఆదేశాల మేరకు గోప్యంగా ఉంచారు శ్రీశైలం పోలీసులు. 

 పది రోజులగా ఇద్దరు బాలురు దర్శనం పేరుతో క్యూలైన్ల లో ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు.  హుండీ చోరీ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్​ కుతరలించారు.  వారిలో ఒక మహిళ .. ఇద్దరు బాలురు ఉన్నారు. ఇద్దరు బాలురిని  జునైల్ హోమ్ కు  తరలించారు అయితే చోరీ విషయమై విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఆలయ సీనియర్ అసిస్టెంట్ బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసేందుకు ఆలయ ఈవో శ్రీనివాసరావు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.