
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటును కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుణ నియోజకవర్గ ఎమ్మెల్యే పన్నాలాల్ షాక్య మాట్లాడారు.
మీరు చదివే డిగ్రీతో భవిష్యత్తులో పెద్దగా ఏమీ ఉపయోగముండదని అందుకని మీకో సలహా ఇవ్వాలనుకుంటున్నానని డిగ్రీలకు బదులుగా మోటార్ సైకిల్ పంక్చర్ రిపేర్ దుకాణాలను తెరవండని సూచించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ఎమ్మెల్యే అయ్యుండి ఇలా మాట్లాడటం ఏంటని నెటిజన్స్ ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.