కోర్టులో కూడా న్యాయం జరగలేదు

కోర్టులో కూడా న్యాయం జరగలేదు

హైదరాబాద్ : ప్రభుత్వం ఏకపక్షంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యేలు. తమ సస్పెన్షన్ పై అసెంబ్లీ సెక్రటరీ ప్రొసీడింగ్స్ కాపీ ఇవ్వలేదన్నారు. కోర్టుకు వెళ్తే కూడా న్యాయం జరగలేదన్నారు. సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్తామంటే.. హైకోర్టు కొట్టేసిన ఆర్డర్ కాపీ ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రభుత్వం, కోర్టులు కూడా తమ గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదన్నారు.

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సభ ముగిసేవరకు సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టును బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. అయితే సస్పెన్షన్‌పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రాజాసింగ్, రఘునందన్ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవగానే ఆర్ధిక మంత్రి హరీష్ 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. గవర్నర్ ప్రసంగం లేదంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.  దీంతో మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. తమ సస్పెన్షన్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఎమ్మెల్యేలు  ఆశ్రయించారు.