కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం హర్షనీయం

కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం హర్షనీయం

హైదరాబాద్ : కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం మక్కలను కొంటామని చెప్పడం రైతుల విజయమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రైతుల ఆందోళనలతో ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పారు. కొన్నిరోజులుగా రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాలకు వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని నిజామాబాద్ కలెక్టర్‌కు ఎంపీ వినతి పత్రం అందజేశారు.

తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో కలిపి క్వింటాలు రూ.1850కి కొనుగోలు చేయడం చాలా సంతోషమన్నారు. ఇది పూర్తిగా నిజామాబాద్ ప్రాంత రైతుల పోరాట ఫలితమని ఎంపీ తెలిపారు. అదే విధంగా.. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేల నష్టపరిహారాన్ని అందించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి రూ. 2500 మద్దతు ధర ప్రకటించాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కార్‌ను కోరారు ఎంపీ అర్వింద్.