పాకిస్తాన్ కంటే TRS, TDP, కాంగ్రెస్ చాలా డేంజర్ : అరవింద్

పాకిస్తాన్ కంటే TRS, TDP, కాంగ్రెస్ చాలా డేంజర్ : అరవింద్

హైదరాబాద్ : పాకిస్తాన్ కంటే టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ చాలా డేంజర్ అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజాం షుగర్ ఫ్యాక్టరీపై శుక్రవారం ఆయన హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసులో మాట్లాడారు. ‘కేసీఆర్ కుటుంబం వల్ల రాష్ట్రానికి ఈ దుస్థితి. వాళ్ళు పని చేయరు, ఇంకెవరినైన చేస్తా అన్న చేయనివ్వరు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజాం షుగర్ ప్యాక్టరీ బాధితుల విషయంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యగా ఉన్నారని తెలిపారు. ఫ్యాక్టరీ యాజమాన్యానికి అపాయింట్ మెంట్ ఇచ్చిన కేసీఆర్.. కలవడానికి మాత్రం టైం లేదనడం సరైంది కాదని తెలిపారు.

చెరకు సాగుకు రైతులను ప్రభుత్వ ప్రోత్సహించాలని తెలిపారు. మోడీ ప్రభుత్వంలో షుగర్ కు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రలో షుగర్ ఫ్యాక్టరీలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయని తెలిపారు. జూన్ 3న నిజాం షుగర్ పరిశ్రమను లిక్విడిషన్ చేయాలని చెప్పారు. చంద్రబాబు చేసిన పాపం వల్ల నిజాం షుగర్ ఫ్యాక్టరీ పాడైపోయింది. ఆ పాపం ఆయన అనుభవిస్తున్నాడు. 11 లక్షల 16 వేల టన్నుల షుగర్ ని క్రషింగ్ చేశారు. అప్పట్లో ఎఫార్బీ కంటే4శాతం అదనపు నిధులు ఇచ్చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ విషయంలో అన్ని పార్టీలు మాకేంటి అన్న చందంగా తయారయ్యాయి. తెలంగాణలో కేసీఆర్ అత్యంత తెలివైన అవినీతి పరుడు. పరిశ్రమ బాగుపర్చే ఆలోచన లేదు, దాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకరారు.

ఎవర్ని టెకోవర్ చేయనువ్వడు. రైతులు వెళ్లిన కలిసే ప్రయత్నం చేసిన దొర పైనుండి కిందకు దిగడు. పెట్టిన పెట్టుబడి తిరిగి ఇస్తే ఫ్యాక్టరీ వదిలేసి వెళ్తామని యాజమాన్యం చెప్పింది. ఎంత ఖర్చు అయిందో చెప్తే ఇస్తామని చెప్పిన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వదు. రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగులు కూడా రోడ్డున పడ్డారు. చక్కెర కు మంచి ధర ఉంది,మోడీ ప్రభుత్వం మంచి ధర కల్పిస్తోంది. ప్రభుత్వం పెట్టుబడిం పెట్టడానికి రావాలి, కేంద్రం నుండి ఎలాంటి సహకారం కావాలన్న మేము సిద్ధంగా ఉన్నాం. అని చెప్పారు ఎంపీ అరవింద్.