హిందూ పండుగలకు పెట్టే డీజేలు ఎత్తుకుపోయేందుకేనా పోలీసులు..?

హిందూ పండుగలకు పెట్టే డీజేలు ఎత్తుకుపోయేందుకేనా పోలీసులు..?

పోలీసు వ్యవస్థ నిజామాబాద్ జిల్లాలో ఎటుపోతుందో అర్ధం కావడంలేదన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. బుధవారం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. హిందూ పండుగలకు పోలీసులు డీజేలు ఎత్తుకుపోయేందుకు పర్మీషన్ ఉంటది కానీ..టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు, రౌడీయిజం చేసినా పట్టించుకోకపోతే పోలీసులుండి ఏంలాభం అన్నారు. దుబ్బాక ఫలితం చూశాకనైనా పోలీస్ డిపార్ట్ మెంట్ మేల్కోవాలన్నారు. పోలీస్ వ్యవస్థను నాశనం చేసుకోవద్దన్నారు. పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చుకుంటే ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమన్నారు. ఓ మహిళను దారుణంగా చంపేసినా.. ఇంతవరకు విచారణ చేపట్టకపోతే లా అండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుందో అర్ధంకావడంలేదన్నారు. పోలీసులు చేస్తున్నదేమిటంటే.. వినాయక చవితి, అమ్మవారి నవరాత్రుల్లో పెట్టే డీజేలు ఎత్తుకుపోయేందుకు మాత్రమే పనికి వస్తున్నారన్నారు.

మర్డర్ చేసినవాళ్లను వదిలేసుకుంటూ పోవడం.. ఇదేనే రాష్ట్రంలో పోలీసు వ్యవస్ధ వ్యవహరించడం అని ప్రశ్నంచారు. కొన్ని మీడియా సంస్థలు కూడా మన రాష్ట్రంలో మర్డర్లు జరుగుతున్నా టెలికాస్ట్ చేయడంలేదని.. టీఆర్ఎస్ కు భయపడవద్దన్నారు. మీరు యాక్షన్ తీసుకోకపోతే దుర్మార్గాలకు సహకరించినవారవుతున్నారన్నారు. ఇంత టెక్నాలజీ ఉన్నా.. మర్డర్లు చేస్తున్నా రియక్ట్ కాకపోతే పోలీసులు ఉండి న్యాయం జరుగకపోవడం దారుణమన్నారు. పోలీసులు కొంచెం పద్దతులు మార్చుకోవాలన్నారు. అవినీతి, అధర్మం, అబద్దాలు కల్వకుంట్ల కుటుంబ నైజం అన్నారు. రైతులు దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడించారని.. అన్నదాతలంతా మోడీవైపు ఉన్నారన్నారు. సన్నరకం వేసిన రైతులు తీవ్రంగా నష్టపోవడంతో చాలా చోట్ల పంటను కాల్చివేశారని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడాల్సిన పోలీసులే చేతులెత్తేస్తే ఎలా అని ప్రశ్నించారు ఎంపీ అరవింద్.