అందుకే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది: ఎంపీ లక్ష్మణ్

అందుకే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది: ఎంపీ లక్ష్మణ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ఏ రాజకీయ పార్టీకి సంబంధాలు ఉండవన్నారు.  ఢిల్లీ  లిక్కర్ కేసులో గతంలోనే ఈడీ 8 సార్లు సమన్లు కేజ్రీవాల్ కు  జారీ చేసిందన్నారు. కాని, సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదన్నారు. తప్పు చేయకుంటే కేజ్రీవాల్ ఈడీ నోటీసులను ఎందుకు తిరస్కరించారన్నారు. అందుకే చివరికి అరెస్ట్ చేయాల్సి వచ్చిందని లక్ష్మణ్ చెప్పారు.

కాగా, గురువారం  రాత్రి 9 గంటల సమయంలో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు ఆయన నివాసంలో దాదాపు రెండు గంటలపాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకుని ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఈక్రమంలో కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆప్ నాయకులు, కార్యకర్తలు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఈడీ అధికారులు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాగా, కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని ఆప్ మంత్రులు తెలిపారు.