బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదు.. 10 స్థానాల్లో బీజేపీ గెలుస్తది: ఎంపీ లక్ష్మణ్

బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదు.. 10 స్థానాల్లో బీజేపీ గెలుస్తది: ఎంపీ లక్ష్మణ్

రాబోయే లోక్ సభలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావ లాంటిదని.. అలాంటి పార్టీతో బీజేపీ ఎప్పటికీ కలవదన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు కుట్రపూరితంగా పొత్తు ప్రచారం చేస్తున్నాయని లక్ష్మణ్ మండిపడ్డారు.  లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందని అన్నారాయన. మూడోసారి కూడా మేమే అధికారంలోకి వస్తామని చెప్పారు. ప్రధాని మోదీపై దేశ ప్రజల్లో నమ్మకం పెరిగిందని.. మోదీ నాయకత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.  తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తామని..10కి పైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఎంపీ లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.