చనిపోయిన ప్రవల్లికకు ఎఫైర్ అంటగడతారా : లక్ష్మణ్

చనిపోయిన ప్రవల్లికకు ఎఫైర్ అంటగడతారా : లక్ష్మణ్

ఉద్యోగం రాక ప్రవల్లిక అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు ఎఫైర్ అంటగడతారా అంటూ పోలీసులపై  బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పైరయ్యారు. ఇది సిగ్గుమాలిన చర్య అని అభిప్రాయపడ్డారు. పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని తాము గవర్నర్ ను కలుస్తామని చెప్పారు.  పోలీసులు అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆయన మాట్లాడారు.  

ప్రవల్లిక ఆత్మహత్యే కేసీఆర్, బీఆర్ఎస్ పతనానికి నాంది అని  లక్ష్మణ్ విమర్శించారు.  నిరుద్యోగులు ఉసురు కచ్చితంగా కల్వకుంట్ల కుటుంబానికి తగులుతుందన్నారు.   నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆమె కుటుంబాన్ని పరామర్శించే తీరిక మంత్రి కేటీఆర్ కు లేదా అని లక్ష్మణ్ ప్రశ్ని్ంచారు.  పొన్నాల లక్ష్మయ్య ఇంటికి  వెళ్ళి పార్టీలో చేర్చుకునేందుకు  కేటీఆర్ కు టైమ్ ఉంటుందా అని నిలదీశారు. 

ప్రవల్లిక ఆత్మ హత్య చేసుకొని చనిపోతే నిరుద్యోగులు వచ్చారు కానీ ఒక్క మంత్రి కూడా రాలేదని లక్ష్మణ్ అన్నారు.  పోలీసులు అడ్డగోలుగా లాఠీ ఛార్జ్ చేశారని ఆరోపించారు.  కల్వకుంట్ల కుటుంబానికి ఇది చివరి ఎన్నిక కావడం కోసం యువత సిద్దం కావాలని పిలుపునిచ్చారు.  

ALSO READ : IND vs PAK: పాక్ 350.. బాబర్ 150: పరువు పోగొట్టుకున్న షోయబ్ అక్తర్