రైతుబంధును ఎగ్గొట్టిన రాష్ట్ర సర్కారు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

రైతుబంధును ఎగ్గొట్టిన రాష్ట్ర సర్కారు : బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: రైతు బంధును పెంచుతామని హామీ ఇచ్చి, చివరికి ఉన్న రైతు బంధును కూడా రేవంత్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రైతులకు వ్యవసా య రుణాల మాఫీకి రేషన్ కార్డు పెట్టడం ఏంటని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు అధికారం కోసం రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని మాయ మాటలు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక దానిని పక్కనబెట్టి రైతులను మోసం చేశారన్నారు. 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షలు ఎప్పుడూ నిర్వహించారో చెప్పే దమ్ముందా? అంటూ ఆయన ప్రశ్నించారు.