రాష్ట్రంలో బీజేపీని పటిష్టపర్చాలని, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమ పాలనను ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ మిషన్ 90+లో భాగంగా ఇవాళ మేడ్చల్ జిల్లా, దమ్మాయిగూడలో నిర్వహించిన సమావేశానికి ఎంపీ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మేడ్చల్ జిల్లాలో మొత్తం 573 బూత్ లు ఉన్నాయని.. కనీసం ఒక్కో బూత్ కు 22 మందితో బూత్ స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని లక్ష్మణ్ సూచించారు. అదేవిధంగా మూడు బూత్ లకు ఒక శక్తి కేంద్రాన్ని నియమించాలని ఆదేశించారు. ప్రజలకు బీజేపీ పాలనను అర్థమయ్యేలా చెప్పి.. ఓటు బ్యాంకును 60 శాతం నుండి 100 శాతానికి పెంచేలా ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి బీజేపీ నేతలు పాల్గొన్నారు.
