
- సంజయ్ అరెస్ట్‌పై.. లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు
- రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ నేతృత్వంలో స్పీకర్‌ను కలిసిన ఎంపీలు సోయం, జీవీఎల్
- లోక్ సభ సభ్యుడి హక్కుల్ని పోలీసులు కాలరాశారని కంప్లైంట్
- పోలీసుల దురుసు ప్రవర్తనతో బండి సంజయ్, ఆయన కుమారుడికి గాయాలయ్యాయని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు : బండి సంజయ్ అరెస్ట్ పై ఆ పార్టీ ఎంపీలు లోక్ సభ స్పీకర్‌కు కంప్లైంట్ చేశారు. బీజేపీ రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఎంపీలు సోయం బాపూరావు, జీవీఎల్ నర్సింహారావు బుధవారం పార్లమెంట్‌లోని స్పీకర్ చాంబర్లో స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఫిర్యాదు కాపీని అందజేశారు. పార్లమెంటు సమావేశాల టైం లో ఎంపీ సంజయ్ హక్కులను కరీంనగర్ పోలీసులు కాలరాశారని రెండు పేజీల కంప్లైంట్లో పేర్కొన్నారు. లోక్ సభ సభ్యుడి హక్కులను కాలరాసినందున పోలీసులను సభాహక్కుల ఉల్లంఘన కింద విచారించాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు, ఏసీపీ శ్రీనివాసరావు, సీఐలు నటేశ్, లక్ష్మీబాబు, దామోదర్ రెడ్డి, ఎస్ఐ రవీందర్ అర్ధరాత్రి 12.10 గంటలకు సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని వివరించారు. రూల్ 223 ప్రకారం.. ఎంపీ అరెస్ట్‌కు ముందు లోక్ సభ స్పీకర్‌కు సమాచారం ఇవ్వాలనే కనీస నిబంధనను పోలీసులు విస్మరించారన్నారు.
పది రోజుల కింద తన అత్త మర ణించడంతో అందుకు సంబంధించిన కార్యక్రమాలు చూసుకుంటున్న ఎంపీ సంజయ్‌ను ఏ కారణం లేకుండానే అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారని స్పీకర్ దృష్టికి ఎంపీలు తీసుకెళ్లారు. సంజయ్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, అందుకు సంబంధించిన మందులను తీసుకునేందుకూ పోలీసులు అనుమతివ్వలేదన్నారు. అరెస్ట్ సమయంలో సంజయ్ భార్య అపర్ణ, ఇతర కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించారని పేర్కొన్నారు. సంజయ్ నోటికి దెబ్బ తగిలిందని, ఆయన కుమారుడు భగీరథకు స్వల్ప గాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రక్షించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఎంపీ సంజయ్‌ను అరెస్టు చేసి ఆయన ఇంటి నుంచి 150 కి.మీ దూరంలో ఉన్న బొమ్మలరామారం పీఎస్‌కు తరలించారని చెప్పారు. ఆ తర్వాత పోలీస్ కారు అద్దాలకు పత్రికలు అడ్డు పెట్టి మరెక్కడికో తరలించారని స్పీకర్ దృష్టికి తీ సుకెళ్లారు. గతంలోనూ తెలంగాణ పోలీసులు సంజయ్‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని స్పీకర్ దృష్టికి బీజేపీ ఎంపీలు తీసుకెళ్లారు. పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన అప్పటి కరీంనగర్ సీపీ సత్యనారాయణ... కమిటీకి క్షమాపణలు చెప్పారని అన్నట్లు సమాచారం. అయితే ఈ సారి సంజయ్ అరెస్ట్ లో పాల్గొన్నది మరో సీపీ అని బీజేపీ ఎంపీలు స్పీకర్‌కు వివరించారు.
సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం : లక్ష్మణ్
బీఆర్ఎస్ సర్కార్ లీకేజీలు... ప్యాకేజీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సం జయ్ అక్రమ అరెస్ట్ అని ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ లక్ష్మ ణ్ విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యతిరే కంగా జరిగిన సంజయ్ అరెస్ట్‌ను ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్లమెంట్ సెషన్లో పాల్గొనడం ఎంపీ ప్రాథమిక హక్కన్నారు. సంజయ్‌ను అరెస్ట్ చేయడం వెనక దురుద్దేశం దాగి ఉందని దుయ్యబ ట్టారు. బుధవారం పార్లమెంట్ ఆవరణ లో ఎంపీలు సోయం బాపురావు, జీవీ ఎల్ నర్సింహారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కొద్ది రోజులుగా బీఆర్ఎస్ సర్కార్ ‘లీకేజీ-.. ప్యాకేజీ’లో పాపులర్ గా మారిందన్నారు. తొమ్మిదేండ్లుగా ఉద్యో గం కోసం ప్రిపేర్ అవుతున్న 40 లక్షల మంది యువత టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తో రోడ్డున పడ్డారన్నారు. విపక్ష కూటమికి చైర్మన్ చేస్తే సార్వత్రిక ఎన్నికల ఖర్చు భరిస్తామని కేసీఆర్ వెల్లడించినట్లు జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన కామెంట్లు దూమారం రేపుతున్నాయని చెప్పారు.