ఖైరతాబాద్,వెలుగు: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ జరిగిన అన్యాయానికి నిరసనగా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని సెక్యులర్ డెమోక్రటిక్ఫోరం అధ్యక్షుడు రిటైర్డ్జస్టిస్చంద్రకుమార్డిమాండ్చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్‌సమావేశం కోలా జనార్దన్అధ్యక్షతన జరిగింది.
ఇందులో చంద్రకుమార్మాట్లాడుతూ .. తెలంగాణ ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే.. బడ్జెట్కేటాయింపుల్లో ప్రధాని మోడీ వివక్ష చూపారని మండిపడ్డారు. అంత మంది ఎంపీలుండి తెలంగాణకు ఏమీ చేయలేకపోతే గౌరవం ఉండదని, ఇప్పటికైనా ప్రధాని వద్దకు వెళ్లి తెలంగాణకు బడ్జెట్కేటాయించేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత పవన్, సౌగరా బేగం, ఎం. నాగరాజు పాల్గొని మాట్లాడారు.
